రోడ్డు భద్రత విద్యార్థులకు అవగాహన
BDK: రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని నామవరం హై స్కూల్ హెచ్ఎం సుధాకర్ రావు పేర్కొన్నారు. రోడ్డు భద్రత ఛాంపియన్‌షిప్ 2025-26లో భాగంగా పాఠశాలలో విద్యార్థులకు రోడ్డు భద్రతపై బుధవారం అవగాహన కలిగించారు. రోడ్డు భద్రతా నియమాలు పాటించటం వల్ల ప్రమాదాలను నివారించవచ్చని హెచ్ఎం విద్యార్థులకు సూచించారు. ఈ సందర్భంగా పాఠశాలలో పలు ట్రాఫిక్ చిత్రాలు వేసి విద్యార్థులకు వివరించారు.