ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య : హెచ్ఎం శ్రీదేవి

SRPT: ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని ప్రధానోపాధ్యాయురాలు శ్రీదేవి అన్నారు. సోమవారం తుంగతుర్తిలో ఎంపీపీఎస్ (ఎస్సీ కాలనీ) పాఠశాల ఉపాధ్యాయ బృందం ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఇంటింటి ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, మధ్యాహ్న భోజనం, దుస్తులు అందిస్తున్నామని అన్నారు.