పెనుకొండలో బస్ షెల్టర్‌ను ప్రారంభించిన మంత్రి
సత్యసాయి: పెనుకొండలోని అంబేద్కర్ సర్కిల్‌లో నూతనంగా నిర్మించిన బస్ షెల్టర్‌ను మంత్రి సవిత సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడం ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ప్రయాణికులకు ఎండ, వర్షం నుంచి రక్షణ కల్పించడంతోపాటు సౌకర్యవంతంగా ప్రయాణం చేయడానికి బస్ షెల్టర్ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.