ఆ నలుగురి వల్లే గెలిచాం: కేఎల్ రాహుల్

ఆ నలుగురి వల్లే గెలిచాం: కేఎల్ రాహుల్

సౌతాఫ్రికాతో ఆదివారం జరిగిన తొలి వన్డేలో భారత్ గెలుపొందిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ అనంతరం టీమిండియా తాత్కాలిక కెప్టెన్ KL రాహుల్ మాట్లాడుతూ.. 'చాలా కాలం తర్వాత వన్డే క్రికెట్ ఆడాం. ఆశించిన ఫలితాన్ని అందుకున్నాం. కోహ్లీ, రోహిత్ అసాధారణ బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లో కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా సత్తా చాటడంతోనే విజయం సాధించాం' అని పేర్కొన్నాడు.