VIDEO: ప్లాస్టిక్ ఫ్యాక్టరీపై దాడి.. భారీగా సరుకు స్వాధీనం
WGL: నగరంలోని ఏనుమాముల మార్కెట్ సమీపంలో నిషేధిత ప్లాస్టిక్ గ్లాసులను తయారు చేస్తున్న 'ఉమా నాగ్ పాలిమర్స్’పై బుధవారం టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సుమారు రూ.12లక్షల విలువైన ప్లాస్టిక్ సరుకును స్వాధీనం చేసుకుని, ఫ్యాక్టరీ నిర్వాహకుడికి రూ.50 వేల జరిమానా విధించారు. అధికారులు యూనిట్‌ను సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు ఏసీపీ మధుసూదన్ తెలిపారు.