న్యాయం చేయాలని అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరాహార దీక్ష
MHBD: బయ్యారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు నాయిని శ్రీనివాస్ రెడ్డిపై గత నెల రోజులు క్రితం హత్యాయత్నం జరిగిన సంఘటనలో, నిందితులను పోలీసులు ఇంకా అరెస్ట్ చేయలేదని బాధితుడు ఆరోపించారు. న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ, సోమవారం అంబేద్కర్ విగ్రహం ముందు ఆయన నిరాహారదీక్ష చేపట్టారు.