గ్యాస్ ఉత్పత్తి 28 శాతం పెంచాం: కేంద్రం

గ్యాస్ ఉత్పత్తి 28 శాతం పెంచాం: కేంద్రం

వంటగ్యాస్ కొరతపై ప్రజలు ఆందోళన చెందవద్దని కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు. సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి కేంద్ర సిద్ధంగా ఉందని తెలిపారు. దేశంలో 28 శాతం గ్యాస్ ఉత్పత్తి పెంచామని వెల్లడించారు. గృహ వినియోగదారులకే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. వారికి ఇబ్బందులు రానివ్వకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు.