నిరుద్యోగ యువతకు ఉచితంగా ట్యాలీ శిక్షణ

నిరుద్యోగ యువతకు ఉచితంగా ట్యాలీ శిక్షణ

ATP: నిరుద్యోగ యువతకు బెంగళూరులో ఉచితంగా ట్యాలీ కోర్సులో శిక్షణ ఇవ్వనున్నట్లు ఉన్నతి ఫౌండేషన్ కోఆర్డినేటర్ హరిప్రసాద్ తెలిపారు. పదోతరగతి, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా చదివి 18-28 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన నిరుద్యోగ యువతీ, యువకులు అర్హులన్నారు. ఈనెల 10 నుంచి 35 రోజుల పాటు బెంగళూరులో ఇచ్చే ఉచిత శిక్షణలో ఉచిత వసతి, భోజన సదుపాయం కల్పిస్తామన్నారు.