రాజన్న ఆలయంలో ఘనంగా కాలభైరవాష్టమి వేడుకలు
SRCL: వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీ కాలభైరవ స్వామి అష్టమి సందర్భంగా ఘనంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అభివృద్ధి కార్యక్రమాల సందర్భంగా, ఆలయ అర్చకులు, వేద పండితులు ఏకాంతంగా విధివిధానాల ప్రకారం అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు.