ఆకివీడులో ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేసిన డీఈవో
పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులోని మాదివాడలో బాలికల ఉన్నత పాఠశాలను, అజ్జమూరులో ప్రాథమిక పాఠశాలను డీఈవో నారాయణ తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు విద్యా, క్రీడలు తదితర అంశాలలో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ఉపాధ్యాయులు సమిష్టిగా కృషి చేయాలన్నారు. ఆయా పాఠశాలలో తెలుగు, ఆంగ్లం, హిందీ తదితర పాఠ్యాంశాలలో విద్యార్థుల సామర్థ్యాలను ఆయన పరిశీలించారు.