హిందూ సమ్మేళనం వాల్ పోస్టర్ ఆవిష్కరణ
KNR: సీతారాం హిందూ సమ్మేళన సమితి (సీతారాంపూర్, ఆరేపల్లి, తీగలగుట్టపల్లి) ఆధ్వర్యంలో ఈ నెల 19న సాయంత్రం 5 గంటలకు సీతారాంపూర్‌లో జరగనున్న హిందూ సమ్మేళనానికి సంబంధించిన వాల్ పోస్టర్‌ను తీగలగుట్టపల్లి కోదండ రామాలయంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షుడు నర్సింగరావు, ప్రధాన కార్యదర్శి రామచంద్ర రెడ్డి, ఉపాధ్యక్షులు ఉన్నారు.