రైతు కన్నీరు కారిస్తే రాష్ట్రానికి అరిష్టం: మాజీ మంత్రి

AP: రైతు కన్నీరు కారిస్తే రాష్ట్రానికి అరిష్టం అని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. రైతుల కష్టాలు పగవాడికి కూడా రాకూడదన్నట్లు కూటమి ప్రభుత్వ పాలన ఉందని విమర్శించారు. 'ప్రధాని మోదీ త్వరగా జమిలీ ఎన్నికలు పెడితే కానీ ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం పోయేలా లేదు. ఈ ప్రభుత్వం వల్ల ఎవరు సుఖంగా ఉన్నారు? కనీసం మీ పార్టీ నేతలైన సుఖంగా ఉన్నారా?' అని ప్రశ్నించారు.