అమ్మవార్లను దర్శించుకున్న GVMC డిప్యూటీ మేయర్
VSP: పెంటమాంబ తల్లి, కుంచమాంబ తల్లి పండగ మహోత్సవ కార్యక్రమంలో మంగళవారం GVMC డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరెడ్డి పాల్గొన్నారు. అనంతరం దేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో 64వ వార్డ్ అధ్యక్షులు ముసలయ్య, స్థానిక నేతలు, తదితరులు పాల్గొన్నారు.