నకిలీ పత్తి విత్తనాల సరఫరా విక్రయాలపై ప్రత్యేక నిఘా

ASF: నకిలీ పత్తి విత్తనాల సరఫరా విక్రయాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు ASP చిత్తరంజన్ ప్రకటనలో అన్నారు. తక్కువ ధరకు వస్తున్నాయని ఉద్దేశంతో నకిలీ విత్తనాలను కొనుగోలు చేసి మోసపోవద్దన్నారు. విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు తప్పనిసరిగా రసీదులు తీసుకోవాలన్నారు. నకిలీ విత్తనాలకు సంబంధించి ఎలాంటి సమాచారం ఉన్న పోలీస్ స్టేషన్‌లో తెలపాలన్నారు.