పాఠశాలను సందర్శించిన జిల్లా కలెక్టర్

SRD: సంగారెడ్డిలోని సంజీవనగర్ ప్రభుత్వ పాఠశాలను జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి సోమవారం సందర్శించారు. పాఠశాలలో విద్యార్థుల హాజరు, పాఠశాల రికార్డులు, పిల్లలు చదువుతున్న తీరును పరిశీలించారు. విద్యర్థులకు నాణ్యమైన విద్యను అందించాలని, చదువులో వెనుకబడిన వారిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డీఈవో వెంకటేశ్వర్లు, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.