అగ్రికల్చర్ డిప్లొమా కోర్సులకు 15న స్పాట్ కౌన్సెలింగ్

ASR: ఆచార్య ఎన్.జి.రంగా విశ్వవిద్యాలయం పరిధిలోని అగ్రికల్చర్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు 15న స్పాట్ కౌన్సెలింగ్ జరగనుందని చింతపల్లి వ్యవసాయ పరిశోధనస్థానం ఏడీఆర్ డాక్టర్ అప్పలస్వామి తెలిపారు. ఇప్పటివరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్న, చేయించుకోని విద్యార్థులు సైతం గుంటూరు లాంఫాం వ్యవసాయ పరిశోధనస్థానంలో జరిగే స్పాట్ కౌన్సెలింగ్‌కు హాజరు కావచ్చన్నారు.