పత్తి పంటలను పరిశీలించిన జిల్లా కలెక్టర్
GNTR: ఫిరంగిపురం మండలం అమీనాబాద్ గ్రామంలో తుఫాన్ వల్ల నష్టపోయిన పత్తి పంటలను బుధవారం గుంటూరు జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా పరిశీలించారు. రైతుల పరిస్థితిని అడిగి తెలుసుకుని, అవసరమైన సహాయం అందించే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టర్‌తో మండల, జిల్లా అధికారులు పాల్గొన్నారు.