వరద నీటి ప్రవాహం వెళ్లేలా కమిషనర్ చర్యలు

వరద నీటి ప్రవాహం వెళ్లేలా కమిషనర్ చర్యలు

నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై.వో నందన్ శుక్రవారం ఉదయం జీఎన్‌టీ రోడ్డులోని కనక మహల్ కూడలి నుంచి ప్రధాన మార్గం వెంబడి డ్రైన్ కాలువల ద్వారా వరద నీటి ప్రవాహాన్ని పర్యవేక్షించారు. డ్రైన్ కాలువలపై తొలగించిన ఆక్రమణల డెబ్రిస్, ఇతర వ్యర్ధాలను రోడ్లపై నుంచి పూర్తిస్థాయిలో తొలగించి, రోడ్లను పరిశుభ్రంగా ఉంచాలని ఆయన సిబ్బందిని ఆదేశించారు.