పోగొట్టుకున్న 52 మొబైల్స్ రికవరీ
JN: వరంగల్ కమిషనరేట్ వెస్ట్ జోన్ పరిధిలో పోగొట్టుకున్న 52 మొబైల్‌ను రికవరీ చేసి జనగామ డీసీపీ రాజమహేంద్ర నాయక్ బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ.. ఎవరైనా ఫోన్ పోగొట్టుకుంటే, లేదా గుర్తుతెలియని వ్యక్తులు దొంగతనంగా ఎత్తుకెళ్లినా, CEIRలో నమోదు చేసుకోవాలన్నారు. ఎవరైనా సెకండ్ హ్యాండ్ సెల్ ఫోన్లు అమ్మితే కొనవద్దని సూచించారు.