ఉచిత మెగా వైద్య శిబిరం

ఉచిత మెగా వైద్య శిబిరం

JGL: మెట్‌పల్లి పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. శిబిరాన్ని మున్సిపల్ ఛైర్మన్ మైలారపు లింబాద్రి, వైస్ ఛైర్మన్ నవీన్, 4వ వార్డు కౌన్సిలర్ పందిరి రమేశ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్, గైనకాలజీ, ప్రసూతి, పిల్లల, కంటి, దంత వైద్య విభాగాలకు చెందిన నిపుణులు పాల్గొని వైద్య సేవలు అందించారు.