ఉత్తమ ప్రతిభ కనపర్చిన జిల్లా ఎంబీబీఎస్ విద్యార్థులు
WNP: వైద్య విద్యలో చివరి సంవత్సరం పార్ట్-1లో వనపర్తి వైద్య కళాశాల విద్యార్థులు తెలంగాణ రాష్ట్రంలో ఉత్తమ ఉత్తీర్ణత ఫలితాలు సాధించారు. మంగళవారం రవీంద్ర భారతిలో మంత్రి దామోదర రాజనర్సింహ చేతుల మీదుగా వనపర్తి మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ మల్లికార్జున్ అవార్డు జ్ఞాపకను అందుకున్నారు. విద్యార్థులు ఉత్తమ ఉత్తీర్ణత శాతం సాధించినందుకు కలెక్టర్ అభినందించారు.