VIDEO: తండ్రి హత్య కేసు.. కుమారులు అరెస్ట్
BHPL: రేగొండ మండలం రేపాక గ్రామంలో తండ్రిని హత్య చేసిన కేసులో ఇద్దరు కుమారులను సోమవారం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. కుర్ర చేరాలు అనే వ్యక్తిని ఆయన కుమారులు కుర్రే రామ్, కుర్రే లక్ష్మణ్‌లు గొడ్డలితో దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. హత్యకు ఉపయోగించిన గొడ్డలి, బైక్, సెల్ ఫోన్లు, బంగారు పుస్తెల తాడు స్వాధీనం చేసుకున్నారు.