చమురు కొనుగోలుకు అనుమతిపై ట్రంప్ స్పందన
ఇరాన్‌తో యుద్ధం వేళ రష్యా చమురును కొనేందుకు భారత్‌కు అనుమతి ఇవ్వడంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. ప్రపంచ దేశాల్లోని ఇంధన మార్కెట్లపై ఒత్తిడిని తగ్గించడానికే భారత్‌కు అనుమతి ఇచ్చినట్లు చెప్పారు. దీని వల్ల రష్యాకు ఆర్థికంగా ఎలాంటి ప్రయోజనం చేకూరదని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా భారత్ తమకు ముఖ్యమైన భాగస్వామి అని వ్యాఖ్యానించారు.