క్రీడా పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
ASF: ప్రభుత్వ క్రీడా పాఠశాలల్లో 4వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆసిఫాబాద్ కలెక్టర్ కె. హరిత ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాఠశాలలకు మార్చి 4 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. మార్చి 13-17 మండల, మార్చి 28-ఏప్రిల్ 1 జిల్లా, ఏప్రిల్ 27, మే 1 రాష్ట్ర స్థాయి ఎంపికలు జరుగుతాయన్నారు.