అదనపు తరగతుల పేరిట దోపిడి..!

అదనపు తరగతుల పేరిట దోపిడి..!

RR: జిల్లాలో ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండ్ ఇయర్ విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షల పేరిట ప్రైవేట్ కాలేజీలు అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్కో సబ్జెక్టుకు రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు తీసుకుంటున్నట్లు తల్లిదండ్రులు వాపోతున్నారు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు ఇది భారంగా మారిందని చెబుతున్నారు.