'మహనీయుల ఆశయ సాధనే లక్ష్యం'!
NLG: సమసమాజ నిర్మాణం కోసం మహనీయుల అడుగుజాడల్లో నడవాలని మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఊటుకూరి అశోక్ గౌడ్ పిలుపునిచ్చారు. రాజాపేట మండల కేంద్రంలోని నవభారత్ కాలనీలో ఆదివారం బాబు జగ్జీవన్ రామ్, జ్యోతిరావు ఫూలే విగ్రహాలను ఆవిష్కరించారు. అంతకుముందు వివేకానంద విగ్రహం నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు.