గంగమ్మ జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే పుట్టా

KDP: మైదుకూరు మండలం శివపురం హరిజనవాడ గ్రామం నందు గంగమ్మ తల్లి జాతర మహోత్సవంలో మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ పాల్గొన్నారు. ఆయనకు వేద పండితులు వేద మంత్రాలతో ఆశీర్వచనం చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యేను గ్రామ టీడీపీ నాయకులు భాస్కర్ రెడ్డి, సుబ్బా రెడ్డి , శీను, గ్రామస్తులు ఘనంగా సత్కరించారు.