బాలిక అదృశ్యంపై కేసు నమోదు

బాలిక అదృశ్యంపై కేసు నమోదు

AKP: ఎలమంచిలి పట్టణానికి చెందిన 15 ఏళ్ల బాలిక అదృశ్యంపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సావిత్రి మంగళవారం తెలిపారు. స్థానిక ప్రైవేట్ స్కూల్లో 10వ తరగతి చదువుతున్న బాలిక ఈనెల 8వ తేదీ రాత్రి రామాలయానికి వెళుతున్నానని ఇంట్లో చెప్పి బయటకు వెళ్ళి అదృశ్యం అయింది. చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభించలేదు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసారు.