ఆత్మకూరు -హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్ బస్సు
WNP: జిల్లాలో ప్రయాణికుల సౌకర్యార్థం ఆత్మకూరు నుంచి హైదరాబాద్‌కు ప్రతిరోజూ ఉదయం 9 గంటలకు ఎక్స్‌ప్రెస్ బస్సు నడుపుతున్నట్లు వనపర్తి డిపో అధికారులు తెలిపారు. ఈ బస్సు ఉదయం 8 గంటలకు వనపర్తి నుంచి బయలుదేరి కొత్తకోట మీదుగా ఆత్మకూరు చేరుకుంటుంది. అనంతరం అక్కడి నుంచి తిరిగి కొత్తకోట మార్గంలో హైదరాబాద్‌కు వెళ్లుతుంది. ప్రయాణికులు వినియోగించుకోవాలని అధికారులు ఇవాళ సూచించారు.