గుడ్లూరులో గుర్తుతెలియని వ్యక్తి మృతి

NLR: గుడ్లూరు మండలం చేవూరు గ్రామ పరిధిలో శనివారం విషాద ఘటన చోటుచేసుకుంది. రామదూత ఆశ్రమం ఎదురుగా ఉన్న శేషమ్మ సత్రం వద్ద నేల బావిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బావిలో ఉన్న మృతదేహాన్ని బయటకి తీశారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు గుడ్లూరు పోలీసు స్టేషన్ సంప్రదించాలని పోలీసులు కోరారు.