సుస్థిర పద్ధతులపై రైతుల్లో అవగాహన పెంచాలి: JC
అన్నమయ్య జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం భూమాత రక్షణ కార్యక్రమంపై కమిటీ సభ్యులతో JC ఆదర్శ రాజేంద్రన్ సమీక్ష నిర్వహించారు. రైతుల్లో సుస్థిర వ్యవసాయ పద్ధతులపై అవగాహన పెంచాలని అధికారులకు సూచించారు. ఎరువుల అధిక వినియోగం వల్ల భూసారం దెబ్బతింటుందని, సహజ పద్ధతుల్లో దిగుబడి పెంచిన రైతులను ఆదర్శంగా చూపాలన్నారు. వ్యవసాయంలో పీ4 కార్యక్రమాన్ని అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.