మలేషియాలో అక్రమంగా తెలంగాణ వాసులు..?
మలేషియాలో అక్రమంగా నివసిస్తున్న విదేశీయులను ఆ దేశ ప్రభుత్వం హెచ్చరించింది. వీసా లేనివారు APR 30 లోపు స్వదేశానికి వెళ్లాలని స్పష్టం చేసింది. మే 1 నుంచి ప్రత్యేక తనిఖీలు చేస్తామని, స్వచ్ఛంగా వెళ్లిపోయేవారికి జైలు శిక్ష ఉండదని హామీ ఇచ్చింది. అయితే మలేషియాలో 80 వేల మంది తెలంగాణవాసులు ఉన్నారని.. అందులో 2 వేల మంది అనుమతి లేకుండా ఉన్నట్లు అంచనా.