బహుజనుల ఆత్మగౌరవానికి ప్రతీక సర్వాయి పాపన్న: కలెక్టర్

VKB: సర్దార్ సర్వాయి పాపన్న 375వ జయంతి సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పాపన్న బహుజనుల ఆత్మగౌరవానికి ప్రతీక అని అన్నారు. కుల వివక్ష లేని సమాజాన్ని స్థాపించడానికి ఆయన కృషి చేశారని, అణగారిన వర్గాల వారికి రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించడానికి పోరాడారని కొనియాడారు.