VIDEO: మూడు కార్లు ఢీ.. భారీగా ట్రాఫిక్ జామ్
HYD: పీవీ నరసింహారావు ఎక్స్ ప్రెస్ బ్రిడ్జ్‌పై ఇవాళ తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. మూడు కార్లు ఒకదానికొకటి ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో ఫ్లైఓవర్‌పై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తున్నారు. కాగా, ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.