VIDEO: అక్రమ నిర్మాణాలు అడ్డుకున్న అధికారులు
JN: పాలకుర్తి మండల కేంద్రంలో శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయ భూమిలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలను దేవాదాయ శాఖ అధికారులు శనివారం అడ్డుకున్నారు. సర్వే నంబర్లు 542, 543లో నిర్మాణాలను నిలిపివేసి, కొంత భాగాన్ని కూల్చివేశారు. ఆలయ భూముల్లో ఆక్రమణలు చేస్తే దేవదాయ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఈఓ లక్ష్మీ ప్రసన్న హెచ్చరించారు.