దశలవారీగా అభివృద్ధి పనులు చేపడతాం: MLA
హన్మకొండ పట్టణంలోని 11, 59 డివిజన్లలో రూ. 50 లక్షల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు గురువారం ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణ జనాభా పెరుగుదలతో పాటు కాలనీల్లో పెరుగుతున్న అవసరాల్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి డివిజన్‌లో దశలవారీగా అభివృద్ధి కొనసాగిస్తామని తెలిపారు.