VIDEO: వైభవంగా సీతారాముల కళ్యాణం
Vsp: గాజువాకలోని సెలెస్ట్ కమ్యూనిటీలో శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. వేద మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల మధ్య జరిగిన ఈ వేడుకకు భక్తులు భారీగా హాజరయ్యారు. భక్తిశ్రద్ధలతో స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి ఆశీస్సులు పొందారు. విశేష ఆధ్యాత్మిక శోభతో విలసిల్లిన ఈ కళ్యాణ కార్యక్రమంతో పూర్తిగా పండుగ వాతావరణం ఏర్పడింది.