జిల్లా పరిషత్ పాఠశాల జల దిగ్బంధం.

VZM: శృంగవరపుకోట మండలం తిమిడి గ్రామంలో ఇటీవలే కురిసిన వర్షాలకు పాఠశాల ఆవరణ అంత వర్షపు నీటితో నిండిపోయింది. దినితో పాఠశాలకు వెళ్ళే విద్యార్థులు ఇక్కట్లుకు గురయ్యారు. వెంటనే అధికారులు స్పందించి వర్షపు నీటిని తొలగించి ప్రహరీ గోడ నిర్మించాలని విద్యార్థుల తండ్రులు కోరుతున్నారు. గత 2 రోజులుగా విద్యార్థులు పాఠశాలకు వెళ్ళడం లేదన్నారు.