VIDEO: 'వ్యవసాయ కార్మిక సమస్యలపై సమరశీల పోరాటాలు'
KMM: చింతకాని మండలం నాగులవంచలో ఆదివారం మధిర డివిజన్ వ్య.కా.స మహాసభ జరిగింది. జిల్లా కార్యదర్శి పొన్నం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. వ్యవసాయ కార్మికుల సమస్యలు, హక్కులు, కనీస వేతనాల సాధనపై చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. సంఘం బలోపేతమైతేనే రైతు కార్మికుల గళం బలపడుతుందని, వ్యవసాయ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై సమరశీల పోరాటాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.