సచివాలయాలను తనిఖీ చేసిన ఎంపీడీవో
ప్రకాశం: మర్రిపూడి మండలం కూచిపూడి, అంకెపల్లి సచివాలయాలను ఎంపీడీవో షేక్ నాగర్ వలి ఆకస్మికంగా తనిఖీ చేశారు. సచివాలయలో రికార్డులను పరిశీలించారు.. సచివాల సిబ్బందికి పలు సూచనలు చేశారు. సచివాలయ సిబ్బంది సకాలంలో విధులకు హాజరు కావాలని సూచించారు. ప్రభుత్వం నిర్దేశించిన సర్వేలను ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని ఆదేశించారు.