'YVU అభివృద్ధికి రూ. 100 కోట్లు కేటాయించాలి'

KDP: యోగివేమన యూనివర్సిటీ అభివృద్ధికి రూ. 100 కోట్లు కేటాయించాలని RSF రాష్ట్ర అధ్యక్షుడు డీఎం ఓబులేసు యాదవ్ డిమాండ్ చేశారు. బుధవారం ప్రొద్దుటూరు SCNR ప్రభుత్వ డిగ్రీ కాలేజీ వద్ద విద్యార్థులతో కలిసి ఆయన కరపత్రాలు విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ.. YVUలో ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్, లా, బి.ఎడ్ కోర్సులను ఏర్పాటు చేయాలని తెలిపారు.ఆగిన నిర్మాణాలను వెంటనే చేపట్టాలని తెలిపారు.