‘చేనేతలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి'

KRNL: ప్రతి చేనేత కార్మికుడూ ఓ పారిశ్రామికవేత్త కావాలని చేనేత, జౌళి శాఖ కమిషనర్ రేఖా రాణి పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో చేనేత కార్మికుల ఐడీ కార్డులు, సొసైటీ ఏర్పాటు తదితర అంశాలపై సంబంధిత అధికారులు, కలెక్టర్ రంజిత్ బాషాతో కలిసి సమీక్ష నిర్వహించారు. చేనేత కార్మికులు సొసైటీలుగా ఏర్పాటై ప్రభుత్వ పథకాలను వినియోగించుకోవాలని కోరారు.