ఆర్టిసి బస్సు నడిపిన ఎమ్మెల్యే

సత్యసాయి: శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర పట్టణంలో మడకశిర నుంచి కర్నూల్ ఆర్టీసీ నూతన బస్సును ఎమ్మెల్యే ఎమ్మస్ రాజు ప్రారంభించారు. అనంతరం స్వయంగా ఎమ్మెల్యే ఎంఎస్ రాజు బస్సును కొంత దూరం డ్రైవ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి తదితర నాయకులు పాల్గొన్నారు.