బెజ్జంకిలో గరుడ వాహన సేవ
SDPT: బెజ్జంకి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు భక్తి వాతావరణంలో వైభవంగా కొనసాగుతున్నాయి. బుధవారం గరుడ వాహన సేవలో భాగంగా స్వామివారు అలంకారంగా పురవీధుల గుండా ఊరేగారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి దర్శనం చేసుకుని మొక్కులు తీర్చుకున్నారు. మహిళలు మంగళహారతులతో, పూలమాలలతో స్వాగతం పలికారు. వేదఘోషల మధ్య కార్యక్రమం ఘనంగా జరిగింది.