ప్రకృతి వ్యవసాయం.. ఆదర్శంగా నిలిచిన యువ రైతు
MDK: కరోనా లాంటి మహమ్మారి తర్వాత ప్రజలు ఎక్కువగా ఆర్గానిక్ ఫుడ్ వైపు మళ్లారు. ఈ క్రమంలో రామాయంపేట మండలం దొంగల ధర్మారంలో అరుణ్ అనే యువ రైతు తన వ్యవసాయ పొలంలో ప్రకృతి వ్యవసాయం చేపట్టాడు. వ్యవసాయ భూమిలో ఎలాంటి పురుగు మందులు వాడకుండా కేవలం ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పశువుల పెడ, ఆవు మూత్రము, జీవామృతంతో వరిని సాగు చేస్తూ.. నేటి సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నాడు.