నేడు అమరచింతలో ఎంపీ అరుణ పర్యటన
WNP: అమరచింతలో పాలమూరు ఎంపీ డీకే అరుణ నేడు పర్యటించనున్నట్లు బీజేపీ పట్టణ అధ్యక్షురాలు మంగా లావణ్య తెలిపారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు పెద్ద చెరువు పునరుద్ధరణ కార్యక్రమంలో పాల్గొంటారు. అమృత 2.0 పథకంలో రూ.314 కోట్లతో చేపట్టనున్న ఆధునికరణ పనులకు భూమిపూజ చేస్తారు. ఈ కార్యక్రమానికి కార్యకర్తలు హాజరుకావాలని పిలుపునిచ్చారు.