కపూర్ ఫ్యామిలీపై డాక్యుమెంట‌రీ.. ట్రైల‌ర్ రిలీజ్

బాలీవుడ్ స్టార్ ఫ్యామిలీ కపూర్‌పై డాక్యుమెంటరీ రాబోతుంది. 'డైనింగ్ విత్ ది కపూర్స్' పేరుతో తెరకెక్కిన ఈ సిరీస్ ఈ నెల 21 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఇందులో రణ్‌బీర్, కరిష్మా, కరీనా తదితర ప్రముఖులు ఆసక్తికర విషయాలను పంచుకోనున్నారు. తాజాగా ఈ డాక్యుమెంటరీ ట్రైలర్ విడుదలైంది.