రిమాండ్‌లో ఉన్న నేతలను కలిసిన మాజీ ఎమ్మెల్యే

రిమాండ్‌లో ఉన్న నేతలను కలిసిన మాజీ ఎమ్మెల్యే

సత్యసాయి: పెనుకొండ సబ్ జైలులో రిమాండ్‌లో ఉన్న వైసీపీ నేతలను పుట్టపర్తి మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌ రెడ్డి పరామర్శించారు. కొత్తచెరువు, పోతులకుంట, బిట్రగుంటపల్లికి చెందిన ఎం. సురేష్, డీ. మదన్ మోహన్‌తో సహా ఏడుగురు నేతలను ఆయన ఓదార్చారు. పార్టీ తరపున అన్ని విధాలుగా తమకు అండగా ఉంటామని, అధైర్యపడొద్దని భరోసా ఇచ్చారు.