క్రీస్తు రాజుపురంలో అధ్వానంగా డ్రైనేజీ

క్రీస్తు రాజుపురంలో అధ్వానంగా డ్రైనేజీ

కృష్ణా: విజయవాడ క్రీస్తు రాజపురంలోని సైడ్ డ్రైన్ అద్వానంగా మారింది. వారం రోజులుగా సైడ్ డ్రైనేజీలో చెత్త తొలగించకపోవడంతో దోమలు పెరిగిపోయాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. విపరీతమైన దుర్గంధం వెదజల్లుతుందని, పారుదల లేక పురుగులు కూడా ఏర్పడుతున్నాయన్నారు. తక్షణమే అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.