సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేసిన ఎమ్మెల్యే
ADB: ఉట్నూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రూ. 64000 సీఎం సహాయనిది చెక్కును లబ్ధిదారుడికి నిర్మల్ డీసీసీ అధ్యక్షులు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అందజేశారు. ఖానాపూర్ మండలానికి చెందిన అసీన బేగం అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందారు. సీఎం సహాయనిధి ద్వారా రాష్ట్రంలో నిరుపేదలకు అండగా ప్రజా ప్రభుత్వం నిలుస్తుందని ఎమ్మెల్యే అన్నారు.